మబ్బులు ఢీకొని మెరిసిన మెరుపువై...
మెరుపుల వేడికి ఉరిమిన ఉరుమువై...
ఉరుముల బెదురుకు కరిగిన మేఘమై...
నింగిని వీడిన వర్షపు జల్లువై కురిసావు...!
భూమిని తాకిన తొలకరి చినుకులా కలిసావు...!
ఇన్నాళ్ళు ఊపిరిలేని నా దేహం, కొత్తగా శ్వాసని పీల్చింది...
కొన్నాళ్ళు కనుమరుగైన నీ రూపం, నిండుగా దర్శనమిచ్చింది...
నిదురించిన నా గుండెకు వేకువ తెచ్చింది...
మరణించిన నా మనసుకి ప్రాణం పోసింది...
గ్రీష్మంలో వసంతమై నా హృదయానికి చిగురుని తొడిగింది...!!
నిశీదిలో వెన్నెలలా నా కన్నులలో వెలుగుని నింపింది...!!!