Saturday, August 25, 2012

తుఫాను


" తుఫాను "

నింగిలాంటి నాలో
మేఘమై వచ్చావు...!

మెరుపులాంటి కళ్ళతో...
ఉరుములే తెచ్చావు...!

మంచులాంటి శ్వాసతో
గాలిలా వీచావు...!!

మదువులాంటి ప్రేమతో...
వానలా కురిశావు...!!

మల్లెలాంటి స్పర్శతో...
తీవ్రతే పెంచావు...!!

కడలిలాంటి నా మనసులో...
తుఫానులే తెచ్చావు...!!



No comments:

Post a Comment