రగిలే అగ్నిపర్వతం నేను, మంచు కప్పుకున్నా...!
వెలిగే సూర్యబింభం నేను, మబ్బు చాటునున్నా...!
కదిలే కాలమే ఎదురుతిరిగింది...
కాలసర్పమై కాటువేసింది...!
కదిలే కాలమే ఎదురుతిరిగింది...
కాలసర్పమై కాటువేసింది...!
మదిలో శాంతమే దూరమైయింది...
యదలోచీకటే నిండిపోయింది...!
గుడిలో దైవమే మాయమైయింది...
కొలిచేమనసుకే గాయమైయింది...!
నాలో చీకటుంది నేడు, త్వరలో వెలుగు నిండు చూడు...!
కాలం ఎదురుతిరుగుతున్నా...
కసి కసిగా అడుగులేస్తువున్నా...!
శాంతం దూరమౌతువున్నా...
ముసి ముసిగా నవ్వుచిందుతున్నా...!
దైవం మాయమౌతువున్నా...
నాకు నేనే వరములిస్తువున్నా...!
ఒకటే కాంతిపుంజం నేను, నాలో రంగులేన్నో చూడు...!!!
నడిచే ఆత్మవిశ్వాసం నేను, నాలో విజయముంది చూడు...!!!
No comments:
Post a Comment