నీ గుండె అనే లోయలో వాగులా ప్రవహిస్తున్నా...
మద్యలోఆపకే మరలలేక నిశ్చలమై నిలిచిపోతా...!
నీ చూపు అనే దారిలో గమ్యమే వెతుకుతున్నా...
నిదురలోజారకే జాడలేక గమనమే మారిపోతా...!!
నీ మది అనే నదిలో పడవలా తేలుతున్నా...
కడలిలోకలవకే ఈదలేక అలలలో మునిగిపోతా...!!!
నీ ప్రేమ అనే పంజరంలో గువ్వలా బందీనైవున్నా...
నింగిలోవదలకే ఎగురలేక నేలపై కూలిపోతా...!!!!
నీ తలపు అనే ఆకాశంలో జంటగా విహరిస్తున్నా...
తోడులోవీడకే జోడులేక గాలిలో కలిసిపోతా...!!!!!

No comments:
Post a Comment