ఆకాశం అంచు ఎక్కడుంది ?
పరలోకం ఎంత ఎత్తునుంది ?
మనలో వదిగిన ప్రాణం ఎక్కడుంది ?
మదిలో మెదిలిన భావం ఎక్కడుంది ?
నీ నుదుట రాత ఏమి రాసివుంది ?
నీ చేతి గీత ఏమి చెబుతుంది ?
అదృష్టం తలుపు ఎప్పుడు తడుతుంది ?
సృష్టి అంతం ఎప్పుడు ఉంటుంది ?
నిదుర ఎక్కడుంటుంది, అది నీ కళ్ళ పైకి ఎప్పుడు వస్తుంది ...?
ప్రేమ ఎక్కడుంటుంది, అది నీ మనసులోకి ఎప్పుడు వస్తుంది ...?
తెలియదు కదా ఏ ఒక్క "రహస్యం"..!
http://kavithalapallaki.blogspot.com

No comments:
Post a Comment