Monday, July 30, 2012

Enduku


" ఎందుకు ? "

నీ బుగ్గలు చేమంతి మొగ్గలు..
కొరికితే కొడతావు, పట్టుకుంటే జారిపోతావు...!

నీ సోకులు మల్లెపూరేకులు..
తాకితే తంతావు, కౌగిలో కరిగిపోతావు...!

నీ అందాలు అరవిందమకరందాలు,
కషాయంలా కనిపిస్తాయి, తాగితే తేనెననిపిసావు...!


నీ పలుకులు పారిజాతపుష్పాలు,
సరిగమలు పలికిస్తావు, సంబరాలు జరిపిస్తావు...!

నీ పెదవులు ఎర్రనిగులాబీలు..
పట్టబోతే కొరికెస్తావు, ప్రేమతో తిట్టేస్తావు...!


http://kavithalapallaki.blogspot.com

1 comment: