సూర్యుడు సిందూరం అవ్వడా నీ పాపిట...
వాడి వేడి వెలుగు చల్లార్చడానికి...!
వాడి వేడి వెలుగు చల్లార్చడానికి...!
చంద్రుడు కమలం అవ్వడా నీ కొప్పున...
వాడి వెండి వెన్నెల వెదజల్లడానికి...!
చుక్కలు అందెలు అవ్వవా నీ కాలికి...
వాటి కోటి కాంతులు నాట్యమాడడానికి...!
ఆకాశం చీర అవ్వదా నీ మేనికి...
దాని అంతం అంతు తెలుసుకోడానికి...!

No comments:
Post a Comment