" కన్నీటి నది "
కంటికునుకు కాజేసి, కన్నీటినదిలో వదిలేసి కనుమరుగయ్యవు...!
గుండెచప్పుడు ఆపేసి, ప్రేమనిప్పులో పడదోసి మనసంతాకాల్చావు...!
ఆకలిలేదు, దాహంలేదు బ్రతుకుమీద ఆశలేదు..
నిద్రలేదు, మరణంరాదు వేచివుండే సహనంలేదు..
మాటలెన్నో చెప్పావు,
మనసుయిచ్చానన్నావు..!
పలికే శిల్పంగ మార్చావు,
నడిచే శవాన్ని చేశావు..!
బాదమదిలో రాజేసి, నా గుండెగనినే తవ్వేసి గాయాలుచేశావు...!
ప్రేమసుడిలో తోసేసి, నా నావనదిలో ముంచేసి వంటిగవడ్డుకిచేర్చావు...!
వేకువలేదు, చీకటిలేదు తలచుకోని క్షణమేలేదు..
తోడులేదు, ప్రాణంపోదు తట్టుకునే శక్తిలేదు..
మొక్కలాగా పెంచావు నీళ్ళుపోశానన్నావు..
పువ్వులాగా విరిశాను తుంచినీవేవెళ్ళావు..!
మనసే నరకంగా మార్చావు..
క్షణమే యుగ్గాని చేశావు..!
కంటికునుకు కాజేసి, కన్నీటినదిలో వదిలేసి కనుమరుగయ్యవు...!
గుండెచప్పుడు ఆపేసి, ప్రేమనిప్పులో పడదోసి మనసంతాకాల్చావు...!
బాదమదిలో రాజేసి, నా గుండెగనినే తవ్వేసి గాయాలుచేశావు...!
www.kavithalapallaki.blogspot.com

No comments:
Post a Comment