Thursday, August 9, 2012

Na Kosam




"నా కోసం"

నా కోసం ఉదయించిన సూర్యకిరణం నీవా...
ఆకాశం వీడి వచ్చిన వెండివెన్నెల నీవా...!

నా కోసం ఉద్బవించిన మౌనరాగం నీవా...
సంతోషం తోడు తెచ్చిన పసిడిపంటవు నీవా...!

నా కోసం వెల్లివిరిసిన నెమలిపించం నీవా...
హృదయం వాకిట కురిసిన మంచువర్షం నీవా...!

నా కోసం వికసించిన ముద్దమందారం నీవా...
బంగారం తోటి చేసిన పుత్తడిబొమ్మవి నీవా...!

నా కోసం నింగికెగసిన సాగరకెరటం నీవా...
భూగోళం చేసుకున్న పూర్వజన్మపుణ్యం నీవా...!





http://kavithalapallaki.blogspot.com

No comments:

Post a Comment