Friday, August 24, 2012

Odipothunna


"ఓడిపోతున్నా"

మురిపించావు నన్ను మరిపించావు, వదిళెల్లావు నన్నుకాదన్నావు...!
అరికాలిలో ముల్లువన్నావు, ఎదురుతగిలే రాయివన్నావు...!

నీ వెంట తిరగడమేనా పాపం...
నాకెందుకీ శాపమరణం...!

నీ ప్రేమ కోరడమేనా నేరం...
నాకెందుకీ శోకభారం...!

నీ చూపే చంద్రుడన్నా.
నీ రూపే దైవమన్నా.
నీ స్పర్శే చాలునన్నా.
నీ తోడే కోరుకున్నా.

ఎక్కడున్నావు ఏమి చేస్తున్నావు, గుర్తుకొస్తున్నావు గుండెకోస్తున్నావు...!

వెతికి వెతికి అలుపొస్తున్నా...
కనిపిస్తావని మరల వెతుకుతున్నా...!

ఏడ్చి ఏడ్చి రక్తమింకుతున్నా...
బాద పోక బాదపడుతువున్నా...!

ఎంతదూరమని రాను, ఎక్కడున్నావని రాను,
ఒక్కడైపోతున్నాను, ఓడిపోతున్నాను.

మరణమైనా తోడువుంటే, చచ్చిపోయి నీ తోడురానా...!!!
 

No comments:

Post a Comment