" వేదిస్తా "
నువ్వు నిద్దుర పోతే,
నువ్వు నిద్దుర పోతే,
కలలో కొచ్చి నిద్దుర లేపేస్తా...!
నిద్దుర లేచి దేవుడ్ని చూస్తే,
దేవుడు నీనై దీవించేస్తా...!
మంచం దిగి అద్దం చుస్తే,
ఎదురుగ వచ్చి ముద్దులు ఇచ్చేస్తా...!
కోపంవచ్చి స్నానం చేస్తే,
నీళ్ళగ మారి నీపై పడిపోతా...!
బూతులు తిడుతూ వంటిని తుడిస్తే,
టవల్ గ మారి నీ తనువుని తాకేస్తా...!
చిరాకు వచ్చి చీరను కడితే,
ఆ చీరగ మారి నీ కౌగిలి పొందేస్తా...!
పనిపై నువ్వు బయటకు వెళ్తే,
నీ నీడగ మారి తోడుగ అడుగేస్తా...!
నువ్వు ఎక్కడకెళ్తే అక్కడికొస్తా,
చుక్కలు చూపిస్తా...! నరకం చూపిస్తా...!! వేదిస్తా...!!!
నువ్వు ఎక్కడకెళ్తే అక్కడికొస్తా,
చుక్కలు చూపిస్తా...! నరకం చూపిస్తా...!! వేదిస్తా...!!!
www.kavithalapallaki.blogspot.in

vadala bommali vadala.....nice ra ramesh...
ReplyDelete