Monday, September 3, 2012

"నా చెలి పాదాలు"



నా చెలి పాదాలు అరవిరిసిన పారిజాతాలు...!
నా చెలి పాదాలు జారిపడేపూల జలపాతాలు...!

నీవు నడిచే దారిలో పువ్వులే సిగ్గుపడి,
ప్రాణమే వద్దుఅని మరణమే కోరుకోవా...!
నీవు నడిచే వేళ్ళలో హంసలే నిన్నుకని,
నడకలే మానుకొని బొమ్మలా నిలిచిపోవా...!

నా చెలి పాదాలు వెలుగుపంచే సూర్యచంద్రులు...!
నా చెలి పాదాలు జీవమిచ్చే నింగినేలలు...!

నీ పాద స్పర్శతో బీడునేలలో
పాడిపంటలే పండుతాయి...!
నీ పాద ముద్రలే వానజల్లులో
వాగువంకలై నిండుతాయి...!

నా చెలి పాదాలు మన్నుతాకిన తొలకరిచిరుజల్లులు...!
నా చెలి పాదాలు మిన్నువిరిసిన రంగులహరివిల్లులు...!

నీవు అడుగులో అడుగేసి అటుగా వెళ్తుంటే,
శ్వాసనే ఆపేసి చూడరా జనులంతా చూపుతో వలవేసి ...!
నీవు మనసునే తొక్కేసి మాయమై పోతుంటే,
విషమే తాగేసి చావరా గనులంతా ఊపిరే వదిలేసి...!

నా చెలి పాదాలు వజ్రమణిమయ చరణాలు...!
నా చెలి పాదాలు సంద్యాసమయ కిరణాలు...!

నీ పాదమడుగున పడిన
చీమైనా సొమ్మసిల్లిపోదమ్మా...!
నీ పాదమడుగు పడిన చోటంతా
కాంతినిండుచూడమ్మా...!

కలియుగ దైవమే నీవు, నీ పాదాలకు పుష్పాంజలి...!!
జగతికి వెలుగువే నీవు, నీ పాదాలకు నమఃసుమాంజలి...!!!

 

1 comment:

  1. awesome mamu.......
    i would like to salute ur thoughts.......!

    ReplyDelete